_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు
_హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పాఠశాల స్థాయి నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు అనుగుణంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పటాన్చెరు పట్టణం లోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అథ్లెటిక్ మీట్ ముగింపు పోటీల కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 34 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జీవితంలో విద్య ఎంత ముఖ్యమో.క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకి క్రీడా పోటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా తీర్చబోతున్నట్లు తెలిపారు.నేటి సమాజానికి పెనుముప్పుగా మారిన డ్రగ్స్ కు ఆమడ దూరంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ లు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగా రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, షేక్ హుస్సేన్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వివిధ మండలాల విద్యా శాఖ అధికారులు రాథోడ్, జెమినీ కుమారి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.