పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
రామచంద్రాపురం ఆర్టీసీ డిపోను ఆర్టీసీ యాజమాన్యం తరలించే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ డిపో ఇక్కడి నుండి తరలించకుండా కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం రోజు డిపో మేనేజర్ కు *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ మవీన్ గౌడ్, సంగారెడ్డి మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, కౌన్సిలర్ మున్నా, కాంగ్రెస్ నాయకులు రాజి రెడ్డి, శశిధర్ రెడ్డి, పీటర్, శాంతమ్మ, శ్రీరాములు, సుధాకర్, ప్రకాష్, సత్యనారాయణ, రమేష్ యాదవ్, మహేష్, విజయ్, అయాజ్ అహ్మద్, రసూల్, మీరజ్, నవీన్ గౌడ్, భిక్షపతి, మల్లేష్, యూత్ కాంగ్రెస్ సభ్యులు నరేష్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.