_దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరువు మండల పరిధిలోని పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన రామాలయం గుడి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం బచ్చుగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన బీరప్ప దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, గ్రామ సర్పంచులు జగన్, సుమతి రామచందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, బిక్ష పతి, కోడూరు బిక్షపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.