_ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ఈనెల 18వ తేదీన పటాన్చెరు పట్టణంలోని ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఫిట్నెస్ ఆఫ్ తెలంగాణ పోటీల ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడా పోటీలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డి.ఎస్.పి భీమ్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, నాయకులు షకీల్, నిర్వాహకులు సతీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.