మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
నొవొటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీసీ) తమ కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 5.5 లక్షల రూపాయలను ఆశ్రయ్ అకృతికి అందించిందని. ఆశ్రయ్ ఆకృతి ప్రతినిధులు తెలిపారు. తద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సహకారంతో నిరుపేద మహిళల అభ్యున్నతికి ఈ నిధులు తోడ్పడనున్నాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అదనంగా 1.5 లక్షల రూపాయలను అందించింది. తద్వారా మొత్తం 7 లక్షల రూపాయలను ఆశ్రయ్ ఆకృతికి అందించినట్లయింది. ఈ నిధులను వినికిడి లోపం కలిగిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన పర్యావరణ వ్యవస్ధను సృష్టించడానికి వినియోగిస్తారు. ఈ చెక్‌ను (పీజెఎస్సీ దుబాయ్) బిజినెస్ హెడ్ సీఎఫ్ ఓ ఎమ్మార్ ప్రాపర్టీస్ మధుసూదన్ రావు ఆశ్రయ్ ఆకృతి ప్రతినిధులకు అందజేశారు. నొవొటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ మాతృసంస్ధ సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సమాజానికి సానుకూలంగా మద్దతు అందించడానికి కట్టుబడి ఉందని, మరీ ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రానికి మద్దతు అందిస్తుందన్నారు.
ఈ ప్రాజెక్ట్ ను ఆశ్రయ్ –ఆకృతి చేపట్టింది. వినికిడి లోపం కలిగిన పిల్లల అభ్యున్నతికి ఇది తోడ్పడుతుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారమందిస్తూ ఆశ్రమ్ అకృతి వారికి సంజ్ఞభాష వ్యాఖ్యాతలుగా పనిచేసేలా శిక్షణ అందిస్తుంది. దివ్యాంగులకు ఇది తోడ్పాటు అందించడంతో పాటుగా ఉద్యోగార్హత నైపుణ్యాలను స్త్రీలకు అందిస్తుంది. వినికిడి సమస్యలు కలిగిన ప్రజలకు కమ్యూనికేషన్ అంతరాలను ఇది తీర్చనుందని తెలిపారు. నొవొటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ , మన సమాజాభివృద్ధికి తోడ్పడటానికి కట్టుబడి ఉండటంతో పాటుగా నిరుపేద మహిళలకు మద్దతు అందిస్తుంది. లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తో చేతులు కలిపి అశ్రయ్ ఆకృతి కి మద్దతు అందిస్తుంది. దీనిలో భాగా సైన్ లాంగ్వేజ్, టెక్నాలజీ వినియోగించి మహిళా సాధికారితకు మద్దతు అందిస్తుంది . తమ ఉద్యోగులు, అతిథులు, భాగస్వాములను సమాజానికి చురుకైన సహకారం అందించేలా ప్రోత్సహించడం ద్వారా స్ధిరమైన అభివృద్ధిపై అవగాహన కల్పించడం సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.