_బ్యాంకర్ల సై కఠినచర్యలుతీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్
మనవార్తలు ,రామచంద్రాపురం:
తీసుకున్న అప్పు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం తో పాటు, ఏజెంట్లు బాధితుడి ఇంటికి వచ్చి దాడి చేయడం తో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఖద్గల్ గ్రామానికి చెందిన రామారావు (35) స్వప్న లకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లోని శ్రీనివాస్ నగర్ లో తన భార్య స్వప్నతో కలిసి నివసిస్తున్నాడు వీరికి ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి 21 రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు రామారావు గతంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా లో సూపర్వైజర్ గా పని చేశాడు. అనంతరం రాపిడో బైక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు రామారావు హెచ్ డి ఎఫ్ సి ఎస్ బి ఐ, బజాజ్ ఫైనాన్స్ లో క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు వీటికి సంబంధించిన ఐ డి ఎఫ్ సి కి 60 వేలు, ఎస్ బి ఐ కి 70 వేలు, బజాజ్ ఫైనాన్స్ కు 55 వేల బాకీ చెల్లించాడు. అయినప్పటికీ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ వాళ్లు ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి, మరో వ్యక్తి ఇంకా బాకీ చెల్లించాల్సి ఉందని గత మూడు నెలల నుండి వేధిస్తున్నారని, పైగా ఇంటికివచ్చి భౌతిక దాడులు చేయడం తో మనస్థానికి గురి చెంది తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకు ఉన్న ఆటో మరియు బైకును అమ్మేసి డబ్బులు చెల్లించినప్పటికీ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగలేవని వాటిని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన భర్త ఆత్మహత్యకు కారణం రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని మృతడి సోదరుడు గురుదాస్, భార్య స్వప్న, మేనమామ అనిల్ ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామరాజు మృతికి కారణమైన సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రికవరీ ఏజెంట్లకు పరోక్షంగా బ్యాంక్ అధికారులు సహకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఆపాలని ఇలాంటి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ కోర్టుకు సైతం వెళ్తామని వారు హెచ్చరించారు. తమలాంటి వారికి ఇక ముందు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వారు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు కేవలం 21 రోజుల బాబును మృతుడి భార్య ఎలా పోషిస్తూ, తన జీవితం కొనసాగిస్తుందని ప్రశ్నించారు పోలీసులు తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని పోలీసులు అందుకు సహకరిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.