పాపులిజం’పై హార్వర్డ్ ప్రొఫెసర్ అవగాహన “

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

చారిత్రక దృక్పథంలో ‘ పాపులిజం’ని ఎలా అర్థం చేసుకోవాలి ” అనే అంశంపై అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం , హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ హిస్టరీ , పబ్లిక్ పాలసీ అధ్యాపకుడు డాక్టర్ మోషిక్ టెమిన్ అవగాహన కల్పించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) లో మంగళవారం ఆయన ఈ అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . పాపులిజం భావన , ఆధునిక , అనంతర ప్రపంచంలో దానికి దారితీసే చారిత్రక అవసరాలపై డాక్టర్ టెమ్మిన్ ప్రసంగించారు . సమకాలీన ప్రపంచంలో చరిత్ర , రాజకీయాల గురించి విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు . జీఎస్హెచ్ఎస్ విద్యార్థులు , పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమం పాల్గొని , ఆతిథ్య ఉపన్యాసాన్ని ఆస్వాదించారు . డాక్టర్ మోపిక్ గురించి .. డాక్టర్ టెమ్మిన్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర ( హిస్టరీ ) లో పీహెచీ పట్టభద్రులయ్యారు . కొలంబియా , పారిస్ విశ్వవిద్యాలయాలలో ఆయన బోధకుడిగా కొనసాగుతున్నారు . ప్రపంచ , తులనాత్మక విధానాన్ని ఉపయోగించి చరిత్ర – పబ్లిక్ పాలసీ మధ్య సంబంధాలపై ఆయన అధ్యయనం చేశారు . ‘ ది సాకో – వాన్జెట్టీ ఎఫెర్డ్ : అమెరికా ఆన్ ట్రయల్ ‘ అనే పుస్తకాన్ని ఆయన రచించారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *