WWW.ZEROCO.DE/SUPER100

హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు

Telangana

 కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు...

హైదరాబాద్:

 

ఐటీ అప్లికేషన్స్‌ అభివృద్ది చేసేందుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది . హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరో కోడ్ ఇన్నోవేషన్ సంస్థ ఐఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో సూపర్ 100 పేరుతో కొత్త కోర్సును రూపకల్పన చేసింది.

పది రోజుల కాలవ్యవధిగల ఈ కోర్సు నో కోడ్ టెక్నాలజీ ఫ్లాట్ ఫాం ఆధారంగా రూపొందించినట్లు జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, భరత్‌లు తెలిపారు .ఇంజనీరింగ్ ,నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు కంప్యూటర్ పై పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్సుకు అర్హులని…ఈ కోర్సు పూర్తయిన వారిలో వంద మందికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు .

దీంతో పాటు మరో వంద మందికి ఇంటర్నషిప్ అవకాశం కల్పిస్తామని తెలిపారు . సూపర్ 100 కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌తో పాటు వెబ్‌సైట్లు, యాప్‌లు రూపొందించుకుని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు .ఈ నెల 23 తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని…మే 29 నుంచి జూన్ 8 వ తేదీ వరకు కోర్సును అన్‌లైన్ ద్వారా అందిస్తామన్నారు . సాఫ్ట్‌ వేర్ రంగంలో కెరీర్ కొనసాగించాలనే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశమన్నారు.

నాన్ టెక్నికల్ బ్యాక్‌ గ్రౌండ్ విద్యార్థులు సైతం ప్రొగ్రామర్లుగా తీర్చిదిద్ది ..వారిని డిజిటల్ 2.O విప్లవంలో భాగస్వాములను చేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు . కోర్సు ఫీజు 7500 రూపాయలుగా నిర్ణయించారు. WWW.ZEROCO.DE/SUPER100 ద్వారా తమ వివరాలను ఎన్‌రోల్‌ చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *