క్రీడా స్ఫూర్తిని చాటండి…

politics Telangana

గీతమ్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు పటాన్చెరు డీఎస్పీ ఉద్బోధ

– ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ఆటల్లో గెలుపోటములు సహజమని , వాటిని సమంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటి , విజయవంతం చేయాలని పటాన్చెరు డీఎస్పీ ఎస్.భీమ్డ్డి ఉద్బోధించారు . గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ‘ లక్ష్య ‘ పేరిట నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్ – కళాశాల క్రీడా పోటీలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన , క్రీడా జ్యోతిని వెలిగించడం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు . స్వయంగా కబడ్డీ , ఫుట్బాల్ క్రీడాకారుడైన భీమ్ రెడ్డి , ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఎంతో వేగవంతమైన ఈ యుగంలో ప్రతి ఒక్కరూ విద్యకే అధిక ప్రాధాన్యం ఇస్తూ , క్రీడలను విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు . దేహ ధారుఢ్యానికి , శక్తివంతంగా తయారవడానికి క్రీడలు అత్యావశ్యకమన్నారు . చాలా కళాశాలల్లో క్రీడా మైదానాలే ఉండవని , క్రీడా నిర్వహణ ఖర్చులకు వెనుకాడుతాయని , అటువంటిది గీతమ్ ఇంత పెద్ద మెదానం , ఇంతమంది క్రీడాకారులు ఉండడం ముదావహమని చెప్పారు .

తమను ఇంత మంచి విద్యా సంస్థలో చేర్చిన తల్లిదండ్రులకు విద్యార్థులు రుణపడి ఉండాలని డీఎస్పీ వ్యాఖ్యానించారు . ఈ మూడు రోజులను మేనేజ్మెంట్ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని , తమలోని నెపుణ్యాలు , ప్రతిభను ప్రదర్శించాలని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు . గీతం క్రీడా విభాగం డిప్యూటీ డెరైక్టర్ నారాయణరావు చౌదరి వందన సమర్పణతో ఈ ప్రారంభోత్సవం ముగిసింది . అంతకు మునుపు , క్రీడాకారులందరితో ప్రమాణం చేయించి , క్రీడా జ్యోతి రిలే పరుగును ఎంబీఏ విద్యార్థి కౌశిక్ ఆరంభించారు . వివిధ జట్లలోని కెప్టెన్లు , క్రీడాకారులందరినీ అతిథులకు పరిచయం చేశారు . తొలుత , టోపాజ్ – ఎమరాల్డ్ జట్ల మధ్య క్రికెట్ పోటీని అతిథులు లాంఛనంగా ప్రారంభించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , పటాన్ చెరు సీఐ ఎన్.వేణుగోపాల్రెడ్డి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . మూడు రోజుల పాటు వివిధ పోటీలతో పాటు సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగనున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *