మునుగోడు నాంపల్లిలో బిజెపికి 497 భారీ మెజారిటీ : రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఓటు బ్యాంకు సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి నాంపల్లి పట్టణ ఇంచార్జి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ ,అధికారబలంతో విచ్చలవిడిగా డబ్బు ,మద్యం పంపిణీ చేయడం పదివేల మోజార్టీతో గెలుపొందారన్నారు.ఇక ఎంపిటిసి పరిధిలోని 3042 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 922, బిజెపికి 1419 ఓట్లు వచ్చాయని తెలిపారు. నాంపల్లిలో బిజెపికి 497 ఓట్లు మెజార్టీ సాధించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇదే మండలంకి టి ఆర్ ఎస్ పార్టీ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంచార్జి గా వ్యవహరించారని తెలిపారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలం లో బిజెపి భారీ మెజారిటీ సాధించిందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. నాంపల్లిలో బీజేపీ పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేందుకు ప్రయత్నించిన గోదావరి అంజిరెడ్డిని పటాన్ చెరు బిజెపి నాయకులు , కార్యకర్తలు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *