రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి :
భైక్ పై వెళ్తున్న యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, రెగోడ్ మండలం, ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విట్ఠల్, జయమ్మ ల పెద్దకుమారుడు ప్రేమ్ కుమార్ (25), ఎస్.ఎన్ కాలని,రామచంద్రాపురంలో నివసిస్తూ బైక్ షో రూమ్ లో సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో భైక్ పై రామచంద్రాపురం వైపు తన బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని అతని తలపై నుండి వెళ్లడం తో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకుపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.