మనవార్తలు ,కొల్లూరు:
అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించడం సరైన విధానం కాదని అనిల్ కుమార్ అన్నారు.
