సృష్టికి ఆధారం మహిళే…

politics Telangana

– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం

మనవార్తలు ,పటాన్ చెరు:

సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా స్ఫూర్తినిచ్చారనేది చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు తెలియజేశారు . ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని మూడు భాగాలుగా విభజించారు . సమకాలీన మహిళల సమస్యలను ప్రతిబింబించేలా శాస్త్రీయ నృత్యం , స్వీయ ప్రేరణ , శరీర సానుకూలతను ప్రోత్సహించేలా పాటలు , చివరిగా చక్కటి వస్త్రధారణతో ర్యాంప్ వాక్తో సదస్స్యులకు నుంచి సందేశాన్నిచ్చారు . విద్యార్థుల కరతాళ ధ్వనులు , ప్రశంసలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *