మనవార్తలు , శేరిలింగంపల్లి:
దేశంలోఅత్యధిక జనాభా కలిగిన బిసిలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం ఓట్లు వేసే మిషన్ల గానే చూస్తున్నాయని. ఇప్పటిదాకా నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్లు ఎటువంటి సహాయం చేయడం లేదని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తెలిపారు..అక్రమ సంపాదనకే పెద్ద పీట వేసుకుని ఉన్నారని ఈ రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.. వీరికి ఓటు వేస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు బాగు పడుతారా అని ప్రశ్నించారు.
బీసీలు తీవ్రంగా మోసగించబడుతున్నారని. న్యాయంగా బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రకులాలు తన్నుకుపోతున్నాయని,. ఉద్యోగాలలో కూడా బీసీలను మోసం చేసి అగ్ర కులాలకు దొంగ మార్గంలో కట్టపెడుతున్నాయని, ప్రభుత్వంలో కీలక పోస్టులలో అధికారులు అగ్ర కులాల వారే ఉంటారని పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పోటీలో ఉంటే వారికి మాత్రమే ఓటు వేయండని, అందుకే బీసీలలో చైతన్యం వచ్చి యావత్ బీసి సమాజాన్ని జాగృతం చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ స్పష్టం చేశారు. బిసి ఉద్యమ పోరాటంలో భాగంగా హాల్లో బిసి చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు.