– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ : పోరెడ్డి బుచ్చిరెడ్డి
మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల ,చందా నగర్ డివిజన్ లోని ,తారా నగర్ కాలనీ నుండి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డులో గత కొన్ని రోజుల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగిపొర్లుతు, రోడ్డు మొత్తం డ్రైనేజ్ వాటర్ తో నిండిపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాలనిలో బీజేపీ బృందం శనివారం రోజు పర్యటించారు. దీనికి సంబంధిత హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి అధికారికి ఫోన్ చేసిన సందర్భంలో వాళ్ళు మా పరిధి లోకి రాదని జిహెచ్ఎంసి వాళ్లు చూసుకుంటారని అనడం అధికారులు సమన్వయ లోపానికి నిదర్శనం అన్నారు. ఇది అధికారుల సమన్వయ లోపం వల్ల తారా నగర్ కాలనీ రోడ్డు మొత్తం డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉదని, కావున వెంటనే డ్రైనేజీ లైన్ లో నిండిపోయిన చెత్తను తీసివేసి, రోడ్లను శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజేపీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి,బీజేపి చందానగర్ డివిజన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, నర్సింహా రెడ్డి, బీజేవైఎం నాయకులు కిరణ్, వినోద్, కాలనీ వాసులు సందీప్ రెడ్డి ,గోవింద్, యుగేందర్, వెంకటేశ్వర్ రావు, గురువయ్య,, లక్ష్మణ్ మరియు ఇతరులు పాల్గోన్నారు.