_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుడు వలె పని చేయాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు.