మనవార్తలు , శేరిలింగంపల్లి :
బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్. తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఆదర్శ్ నగర్ శంశిగూడ కు చెందిన జి శ్రీనివాస్ ఇటీవల డీసీఎం వ్యాన్ ఢీకొని గాయపడి యాక్సిడెంట్ లో తన కాలు విరిగిందన్న విషయం తెలుసుకున్న యోగానంద్ శుక్రవారం రోజు ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
