మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )
ఏదైనా అనుకోని కష్టం ఎదురెనప్పుడు కుటుంబ సభ్యులు , ఆప్తులు , అధ్యాపకులతో పంచుకోవాలని లేదా సమీప సఖి కేంద్రాన్ని సంప్రదించాలని సంగారెడ్డిలోని సఖి కేంద్రం ఇన్ఛార్జి కల్పన , న్యాయవాది నీలిమలు గీతం విద్యార్థులకు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) , గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్ఓ ) లు బుధవారం సంయుక్తంగా నిర్వహించిన ‘ సెబర్ క్రైమ్స్ – విద్యార్థులపై దాని ప్రభావం ‘ అనే అంశంపై వారు ఆతిథ్య ఉపన్యాసం చేశారు . – సెబర్ క్రైమ్ నేరానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదా కంప్యూటర్ను సాధనంగా ఉపయోగిస్తారని చెప్పారు . సెబర్ నేరాలను ఆర్థిక , గోప్యత , హ్యాకింగ్ , సెబర్ టెర్రరిజంగా వారు వర్గీకరించారు . సెబర్ క్రైమ్ ను అరికట్టి , ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు .
చట్టం ముందు స్త్రీ – పురుష భేధం ఉండదని , అంతా సమానమేనని , నేరం రుజువెత్తే శిక్ష అనుభవించక తప్పదని , సాక్ష్యాల రుజువుకే తీర్పు వెలువరించడంలో జాప్యం జరుగుతోందని వారు స్పష్టీకరించారు . ఫేస్బుక్ అప్డేట్లు వీలయినంత తగ్గించుకోవడం మంచిదని , ముఖ్యంగా విచారకర అంశాలను అసలు షేర్ చేయొద్దని , దానిని మరొకరు అవకాశంగా మలచుకొని మనపై అదుపు సాధించొచ్చని వారు హెచ్చరించారు . అలాగే మెనర్లు వాహనాలు నడపడం , తాగి డ్రైవ్ చేయడం , హెల్మెట్ ధరించకపోవడం వంటివన్నీ శిక్షార్హమైనవేనని , అయితే మెనర్ల పట్ల కొంత సానుభూతితో వ్యవహరించినా , తిరిగి తప్పుచేస్తే మాత్రం చాలా కఠిన శిక్షలు ఉంటాయని కల్పన , నీలిమ పేర్కొన్నారు .
ఒకసారి శిక్ష పడ్డాక ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశీ వీసా పొందడం అంత సులువు కాదన్నారు . వీలయినంత వరకు నేరపూరిత చర్యలకు పాల్పడకపోవడమే శ్రేయోదాయకమని స్పష్టీకరించారు . సఖి ఏర్పాటు , దాని పనితీరు , పరిష్కరించిన కేసుల వివరాలు వంటివి వారు విద్యార్థులకు వివరించారు . వారు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి అతిథులను స్వాగతించి , సత్కరించారు . డాక్టర్ సురేష్ కుమార్ దిగుమర్తి , డాక్టర్ దివ్య కీర్తి గుప్తాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు .