త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

_నేటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల

_ఉత్తమ మండలం గా ఎంపిక కావడం పట్ల అభినందనలు

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పటాన్చెరు మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు నీటి నుండి అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల అవుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఉత్తమ మండలం గా పటాన్చెరు ఎంపికై అవార్డు తీసుకోవడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులపాటు సిఎస్ఆర్ నిధులు ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మన ఊరు మనబడి పథకం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *