పటాన్చెరు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ శాఖ కార్యాలయం..

Districts politics Telangana

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి..

_పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు షురూ..

_ఆదేశాలు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

పట్టు వదలని విక్రమార్కుడిగా పేరుందిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విజయం సాధించారు. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సూచనలకు అనుగుణంగా బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ తో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హలో రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకి రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు.. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా కు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *