మనవార్తలు ,నంద్యాల:
నంద్యాల జిల్లా అయిన తర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుందని నంద్యాల సీపీఐ నేతలు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ నంద్యాల కార్పోరేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా చికిత్సలు అందిస్తు రోగులను పీల్చిపిప్పిచేస్తున్నారని మండిపడ్డారు .ప్రతి హాస్పటల్ లో ఏ వైద్యంకు ఎంత ఖర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని ఆసరా చేసుకుని పేషంట్లకు అవసరం లేని పరీక్షలు నిర్వహించి వేల వేలు దోచుకుంటున్నారని విమర్శించారు .నంద్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని రోగులకు లేని జబ్బులు ఉన్నాయంటూ బ్లడ్ టెస్ట్ లు , ల్యాబ్ టెస్ట్ , యాంజియోగ్రామ్ అంటూ ఇతర టెస్ట్ చేస్తు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు .హెల్త్ మాఫియా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారని..సీపీఐ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందన్నారు . నిబంధనలకు విరుద్దంగా ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులను డీఎంఅండ్ హెచ్ఓ అధికారులు సీజ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు .