మనవార్తలు ,పటాన్ చెరు:
మెట్రోరైలు సంగారెడ్డి వరకు సాధించేంత వరకు మెట్రోరైల్ సాధన సమితి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .పటాన్ చెరు గాయిత్రి ఫంక్షన్ హాల్ లో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ నిర్వహించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటామన్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందని మెట్రోరైల్ సాధన లో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు మెట్రోరైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రోరైల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. మెట్రోరైలు సాధన కోసం కార్యాచరణ రూపొందించినట్లు మాజీ ఎమ్యెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టుశ్రీధర్, రాజెందర్ రెడ్డి, బిక్షపతి, మన్నె రాములు,కలివేముల రాజు, రమేష్, రవి ,బలరాం తదితరులు పాల్గొన్నారు .