_భయాందోళనలో స్థానికులు
మనవార్తలు, పటాన్ చెరువు:
అమీన్పూర్లో రాత్రిపూట కాలనీల్లో చెడ్డీలతో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు దుండగులు. తాళం వేసిన ఇళ్ల కోసం తిరు గుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బట్టలు, చెప్పులు తీసి చేతిలో పట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి ప్రహరీ గోడలు దూకి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లా డుతూ. రాత్రిపూట గస్తీ పెంచుతున్నామని, ప్రజలంతా భయాం దోళనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.