బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై దాడి ఖండించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై జ‌రిగిన దాడిని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ త‌ట్టుకోలేకే టీఆర్ఎస్ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు . జ‌నగాంలో జిల్లా దేవరుప్పుల లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి నాయకులు కార్యకర్తలపై చేసిన రాళ్ల దాడికి నిరసనగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎర్రబెల్లి దయాకర్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు . స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల పై టిఆర్ఎస్ దొరల అహంకారం అణచివేతకు నిదర్శనం ఈ రాళ్ల దాడి అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డిన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు . బిజెపి నాయకుల పై కార్యకర్తల పై రాళ్ల దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయ‌డం సిగ్గుచేట‌ని తెలిపారు . భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని దాడికి ప్రతిదాడి తప్పదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చేరు బిజెపి మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి, ఇస్నాపూర్ వార్డు సభ్యులు నారాయణదాసు, బిజెపి మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి, మండల బిజెపి ఉపాధ్యక్షుడు సాయి కుమార్,బిజేవైయం మండల ప్రధాన కార్యదర్శి దిపక్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్ మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు కిశోర్ రెడ్డి,సర్వోత్తం రెడ్డి, రాజ్ గోపాల్, విజయ్,శకిల్, దుర్గా సాయి, రాము, మల్కాపురం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *