జాతీయ భావాన్ని పెంపొందించేలా స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నాం – చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుముదిరాజ్

politics Telangana

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

జాతీయ భావాన్ని ఉప్పొంగేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌ల చిట్కుల్ గ్రామ పరిధిలో 75 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకుల‌ను పుర‌స్క‌రించుకుని 50 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని తెరాస రాష్ట్ర నాయకులు,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్చరీ, స్కేటింగ్ క్రీడాకారిణి బంగారు పతకం విజేత శాన్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.చిట్కుల్ గ్రామ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామ కార్యవర్గం గ్రామస్తులు ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో ఈవో కవిత ,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీటీసీలు మంజుల,మాధవి,వార్డు సభ్యులు దుర్గయ్య,లక్ష్మి, వెంకటేష్,గౌరీ,భుజంగం, మురళి,వెంకటేష్,రాజకుమార్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షుడు వి నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్,గోపాల్,అనిల్,వెంకటేశ్, గ్రామ పెద్దలు,ప్రజలు, యువజన సంఘాలు,విద్యార్థులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *