మనవార్తలు ,పటాన్ చెరు:
వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలి – గడీల శ్రీకాంత్ గౌడ్
గ్రామీణ అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పటాన్చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు తహశీల్దార్ కార్యాలయం వద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్ననిరవధిక సమ్మెకు గడీల శ్రీకాంత్ మద్దతు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జి.వో ను వేంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని…55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిలను వెంటనే పరిష్కరించాలని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రెండుసార్లు సభలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 21వేల మంది వీఆర్ఏలు, 2500 మంది డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలు విధుల్లో ఉన్నారని వీఆర్ఏ సంఘం నేతలు తెలిపారు .వీరిలో 90 శాతం మంది వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన నిరుపేదలేనని వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో వీరంతా అర్ధాకలితో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఇప్పటికే నిరసన తెలియజేశామన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు వీఆర్ఏ సంఘం నేతలు అంటున్నారు .
ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల బిజెపి అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య , పటాన్చెరువు పట్టణ అధ్యక్షుడు కోలుకూరి రాజశేఖర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ , అమీన్పూర్ మండల బిజెపి అధ్యక్షుడు ఆగా రెడ్డి , తెల్లాపూర్ మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు కోటే శంకర్ , జిన్నారం మండల బిజెపి అధ్యక్షుడు బండి శ్రీకాంత్ , బిజెపి ఓబీసీ మోటార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్ , బిజెపి సీనియర్ నాయకులు సహదేవ్ , మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం తదితరులు పాల్గొన్నారు.