మనవార్తలు ,హైదరాబాద్:
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 6% శాతం నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గిరిజన శాఖామంత్రికి వినతి పత్రం సమర్పించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో గిరిజన శాఖ మంత్రి వర్యులు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన 10 శాతం రిజర్వేషన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి
నేడు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఎడల 10% రిజర్వేషన్ అమలు చేయకుంటే తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న 84 వేల ఉద్యోగాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా గిరిజన జీవితాలతో చెలగాటమాడుతుంది అందుకోసం టిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతు పోరాటం చేసిన విధంగా ఢిల్లీలో గిరిజన రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వాలని దానికి యావత్ గిరిజన ప్రజలు కదిలి వస్తారని అన్నారు .
మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి కెసిఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మియపూర్ పరిధిలోని నడిగడ్డ తాండాలో గత 40సం. నుంచి ఉంటున్న గిరిజనులు CRPF వారి ఎదుర్కొంటున్న సమస్యలను తాను ఉన్నత స్థాయి అధికారుల మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్ మరియు మోహన్ సింగ్ నాయక్ ,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ,ఆంగోత్ హరి నాయక్ మరియు ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.