_ సస్పెన్షన్ ఆనంతరం తిరిగి బాధ్యతలు చేపట్టిన – సర్పంచ్ నీలమ్మ
మనవార్తలు, గుమ్మడిదల:
అధికార పార్టీ ఒత్తిళ్లకు తగ్గేది లేదని టాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ పై అధికార పార్టీ నాయకులు నిధుల దుర్వినియోగం అభియోగం మోపి పదవి నుంచి తప్పించారు ఆరునెలల పాటు విచారణ జరిపిన అధికారులు తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన నీలమ్మను సన్మానించారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికార టీఆరెఎస్ పార్టీ తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తుందిఅని ఎద్దేవా చేశారు అధికార పార్టీ ఒత్తిళ్లకు భయపడేది లేదని , ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.