మనవార్తలు ,రామచంద్రపురం:
విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ ఇన్చార్జిగా బి.నారాయణ చారిని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు అశోక్ చారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు .అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ స్థానిక నాయకుల మండల అధ్యక్షులు సంపూర్ణ మద్దతుతో నారాయణ చారిని నూతన నియోజకవర్గ ఇన్చార్జిగా ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు విశ్వకర్మల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం నారాయణచారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొత్తగా ఎన్నికైనా నారాయణ చారి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రామచంద్రాపురం మండల అధ్యక్షుడితో పాటు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని బాధ్యత పెరిగిందని , నా శక్తి మేరకు విశ్వకర్మ బలోపేతానికి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి సంగారెడ్డి జిల్లా యువత ప్రధాన అధ్యక్షులు కృష్ణ చారి, నాగభూషణం చారి, యువత ప్రధాన కార్యదర్శి నాగేష్ చారి, పటాన్ చేరు మండల అధ్యక్షుడు చంద్రశేఖర ఆచారి, గుమ్మడిదల మండల అధ్యక్షుడు భార్గవ చారి ,జిన్నారం మండల అధ్యక్షుడు రామ్మూర్తి చారి, అమీన్పూర్ మండల్ అధ్యక్షుడు జనార్ధన చారి, ప్రవీణ్ చారి, రాము చారి, సుధాకర్ చారి, మహిళా నాయకురాలు పద్మ ,విశ్వకర్మ అన్నపూర్ణ ,తదితర విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు