మనవార్తలు ,పటాన్ చెరు;
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఐదవ చెవిటి, మూగ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో శారీరక లోపం ఉందని చింతించాల్సిన అవసరం లేదని, మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలని కోరారు. భవిష్యత్తులో నిర్వహించి టోర్నమెంట్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జితేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి సురేందర్, ప్రతినిధులు గోపి, శ్రీనివాసరావు, మదన్ కుమార్, మిలింద్ ఆచార్య, సోమేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.