మనవార్తలు ,పటాన్ చెరు;
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున సత్వర నాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది నివాస గృహాలు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయాయి. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో 9 మందికి పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల సొంత నిధులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసిల్దార్లు మహిపాల్ రెడ్డి, విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వంగరి అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.