తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు…
హైదరాబాద్:
వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు.
టీకా కొరత వేధిస్తుండటంతో ఈ రోజు అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరికొన్ని చోట్ల వాగ్వాదాలు జరిగాయి. ప్రభుత్వం రోజూ లక్ష నుంచి లక్షన్నర వరకూ టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ఈ రోజు వచ్చిన టీకా డోసులు కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది.