_జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ పోటీలకు
_ఒక లక్ష 30 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు;
పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ నెల 29, 30, 31 తేదీలలో BHEL లో నిర్వహించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహన కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లక్ష 30 వేల రూపాయల విరాళం అందచేశారు.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల నిర్వాహకులకు వీటిని అందచేశారు.నియోజకవర్గం లో క్రీడలు అభివృద్ధి కోసం మినీ స్టేడియాలు నిర్మించడం తో పాటు క్రీడాకారుల కోసం క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సోమిరెడ్డి, శ్రీధర్ చారి, వెంకటేష్ గౌడ్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.