_భారీవర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం
మనవార్తలు ,రామచంద్రపురం :
భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు ,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఆయా కాలనీలు నీటిలో మునిగాయి .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఆరవ బ్లాక్ లో ఇళ్ళ ముందు మురికి నీరు పొంగి ప్రవహిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు బీఎస్పీ మద్దతు కోరడంతో అక్కడికి వెళ్ళి స్థానికులతో మాట్లాడి వారి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. బీహెచ్ఈఎల్ ఎంఏసీ సొసైటీ నుంచి ఈఎస్ఐ రామచంద్రాపురం వెళ్ళే దారి, బీహెచ్ఈఎల్ రైల్వే స్టేషన్ వద్ద చెత్త డంప్ యార్డ్ లాగా మారిపోయిందని బీఎస్సీపి పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ సుంకు వినయ్ కుమార్ విమర్శించారు.

ఈ విషయంపై పలు మార్లు స్థానిక కార్పోరేటర్ దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కారం కాలేదని విమర్శించారు. స్థానిక ప్రజలు బీఎస్పీ మద్దతు కోరడంతో బీఎస్పీ నేతలు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. రామచంద్రాపురంలోని సమస్యలను రేపు రామచంద్రపురం జిహెచ్ఎంసి కమిషనర్ , జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారించాలని కోరుతామన్నారు . ఈ కార్యక్రమం లొ బీఎస్సీపి పటాన్చెరు నియోజకవర్గం ఇంచార్జి సంజీవ , 111 డివిజన్ ప్రెసిడెంట్ పడమటి శ్రీశైలం , హెచ్ఐజి సెక్టార్ ప్రెసిడెంట్ శాంసన్ ,రామచంద్రపురం సెక్టార్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
