_పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ ,పెన్నులు పంపిణి చేసిన సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి
మనవార్తలు, జిన్నారం :
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు మరియు స్వీట్లు పంపిణి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు సాధిస్తుందని, బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బలోపేతం చెందిందని టీ. రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సెలర్లు టీ. సాయి కిరణ్ రెడ్డి, వి.శ్రీకాంత్ యాదవ్,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషిధర్,జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు కే. లక్ష్మణ్ స్వామి,ఉదయ్ కిరణ్, సమ్మయ్య, బాల్ సింగ్,రాజ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.