మనవార్తలు ,మియపూర్ :
వర్షాకాలంలో తమ విధుల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మున్సిపల్ కార్మికులకు మియపూర్ డివిజన్ లోని మక్తా గ్రామానికి చెందిన బీజేపీ నేత, ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆర్ కె వై టీమ్ పేరుతో ప్రత్యేకంగా తయారు చేహించిన గొడుగులను అందజేశారు. ముందుగా నిరాశ్రుయులైన ప్రజలకు, పేదవారికి ఇచ్చిన అనంతరం పారిశుద్ధ్యకార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజెరావు శ్రీను, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు