మనవార్తలు ,పటాన్ చెరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13 వ స్నాతకోత్సవం జూలై 30 , 2022 న ( శనివారం ) హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు . గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మసీ , హ్యుమానిటీస్ తదితర కోర్సులను 2021-22 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసి , డిగ్రీలు , డిప్లొమోలు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థులు జూలై 18 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు . ఇతర వివరాల కోసం గీతం వెబ్సైట్ www.gitam.edu ను సందర్శించాలన్నారు .