మనవార్తలు ,పటాన్ చెరు:
ఇటీవల పటాన్ చెరు పట్టణం నుండి లడక్ వరకు 2600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైన సాహస యాత్ర ద్వారా చేరుకున్న పటాన్ చెరు పట్టణానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పూలమాలలతో సత్కరించారు.యాత్ర విశేషాలను, యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలను వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు.
నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి సాహస యాత్ర నిర్వహించడం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.భవిష్యత్తులో వెంకటేష్ చేసే సాహస యాత్రలకు, అతని చదువుకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, సోమ శీనయ్య, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.