_కోర్టులో కేసులు ఉన్నా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న జిహెచ్ఎంసి అధికారులు.
– జీహెచ్ఎంసీ కమిషనర్ కు, జోనల్ కమిషనర్ల కు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదు.
– భూ యజమాని పి.సి. నాయుడు ఆవేదన
మనవార్తలు,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, కాంతి వనం కాలనీలో కోర్టు వివాదం లో ఉన్న భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించి, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని భూ యజమాని పి సి నాయుడు తెలిపారు. కోర్టులో కేసులు ఉన్నా పట్టించు కోవడం లేదని, జీహెచ్ఎంసీ కమిషనర్ కు ,మరియు జోనల్ కమిషనర్ కు, ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వీటన్నింటిపై హైకోర్టులో కేసులు వేసి న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. లిఖితపూర్వకంగా మీడియాకు వ్రాసి ఇచ్చి ,తగిన ఆధారాలతో కూడిన అక్రమ నిర్మాణాల ఫోటోలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం, శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లోని కాంతి వనం కాలనీలో 1996 లో సర్వే నంబర్ 218/13లోని రెండు ఎకరాల 15 గుంటల భూమిని, దాని జి.పి.ఏ. హోల్డర్ అయిన వి. మదన్ మోహన్ రావు ద్వారా పి.సి. నాయుడు మరో ఇద్దరు కలిసి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుని, చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నామని,. ఆ తరువాత ఆరు నెలలకు ఇతర దేశాలకు వెళ్లామన్నారు. భూమి కొనుగోలు చేసిన అనంతరం 1996 లోనే ఆ ప్రాంతంలో హైటెక్ సిటీ రావటం వలన, అక్కడ భూముల ధరలు బాగా పెరగటం జరిగిందని అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత 1998 జూన్ లో తాము ఇతర దేశాల లో ఉండగానే, మాకు భూమి విక్రయించిన వి. మదన్ మోహన్ రావు, అమ్మిన భూమిలో కొంత భాగాన్ని వేరే వాళ్లకు తిరిగి అమ్మి వేశాడు. ఇతర దేశాల నుండి తిరిగివచ్చిన తాము భూమిలో కొంత భాగాన్ని వేరే వారికి విక్రయించినట్లు తెలుసుకుని జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సర్వే నంబరు లోని భూమికి లేఅవుట్లు వేయుటకు ప్రభుత్వ అనుమతి లేదు. అయినప్పటికీ వి . మదన్ మోహన్ రావు ఈ సర్వే నంబర్ లో కొంత భూమిని ఫ్లాట్స్ వేసి అక్రమంగా అమ్మడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని తన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అమ్మిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కో ర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగానే 2008 లో ఎల్ ఆర్ ఎస్ కింద, అనధికార లే అవుట్ లకు రెగ్యులేషన్ చేయుటకు ఒక జీవో ఇచ్చారని తెలిపారు..ఈ జీవో ప్రకారం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న భూములకు ఎల్.ఆర్.ఎస్. చేయకూడదు. అయినప్పటికీ తమకు చెందిన భూమిలో, ఆక్రమణదారుల కు కొంతమంది కి కోర్టును ధిక్కరించి ఎల్ ఆర్ ఎస్ల్ లకు అనుమతి ఇవ్వడం జరిగిందని, చట్టవిరుద్ధంగా చేసిన ఎల్ ఆర్ ఎస్ అనుమతిని రద్దు చేయమని జిహెచ్ఎంసి కమిషనర్ కు, మరియు జోనల్, కమిషనర్ లకు ఫిర్యాదు చేయగా స్పందించిన వారు వీటికి అనుమతులు ఇవ్వొద్దని కింది స్థాయి అధికారులకు అదేశించినప్పటికి వారి ఆదేశాలను కూడా లెక్కచేయకుండా అనుమతులు ఇచ్చారని, వాటిపైనా కూడా కోర్టులో మరో కేసు వేయడం జరిగిందన్నారు.తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పి.సి. నాయుడు ఆవేదన వెలిబుచ్చారు.
అదేవిధంగా చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఎల్ ఆర్ ఎస్ లను కూడా రద్దు చేయమని తాను తిరిగి హైకోర్టులో కేసు వేయడం జరిగిందని, ఈ కేసు లో జిహెచ్ఎంసి అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ చట్టవిరుద్ధంగా ఎల్ ఆర్ ఎస్ అనుమతి ఇచ్చిన ఫ్లాట్ ల పై బిల్డింగ్ కట్టుకొనుటకు కూడా జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ విధంగా బిల్డింగ్ నిర్మాణం కొరకు జీహెచ్ ఎంసీ అధికారులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయమని యజమాని హైకోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసు కూడా పెండింగ్ లో ఉండగానే 160 గజాల భూమిని, బి. కవిత అనే వారికి అమ్మగా రెండు అంతస్తుల కు మాత్రమే అక్రమంగా అనుమతి ఇచ్చారు. అయిన అక్రమంగా మూడు అంతస్తులు నిర్మిస్తుండగా, తిరిగి జి.హెచ్.ఎమ్.సి. వారికి ఫిర్యాదు చేయగా, అక్రమంగా నిర్మిస్తున్న మూడవ అంతస్తును 2021 జనవరి నెలలో కూల్చివేశారు.
తిరిగి ఆగస్టు నెలలో కూల్చివేసిన మూడో అంతస్తును నిర్మించి, తిరిగి దాని పై మరో అంతస్తును నిర్మించనప్పటికి అధికారులు అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఆ పక్కనే ప్లాట్ నెంబర్లు 382,383 పార్ట్ లో జీవికె రెడ్డి అనే వ్యక్తి స్టీల్ ప్లస్ 3 కి అనుమతుల కోసం జి హెచ్ ఎం సి లో దరఖాస్తు చేసుకోగా ఈ విషయం తెలుసుకుని ఉన్నతాధికారులను కలిసి ఇది కోర్ట్ వివాదం లో ఉందని అనుమతులు ఇవ్వొద్దని లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశామని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఆపివేసిన అధికారులు తిరిగి అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పి సి నాయుడు కు చెందిన కేసు కోర్ట్ లో గల కొంత ఖాళీ స్థలం లో జి హెచ్ ఎం సి వారు అక్రమంగా పార్క్ చేయాలని, రోడ్లు వేయాలని ప్రయత్నించగా. వాటిని ఆపాలని కోరగా వాటిని మాత్రం ఆపారని తెలిపారు.
అనుమతులు మంజూరు చేయవద్దని కోర్టు నుండి ఆర్డర్ తేవాలని అధికారులు చెప్తున్నారని తెలిపారు. తెలిసి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందేవారికి అధికారులు అండగా నిలవడం వలన మా లాంటి భూ యజమానులు నష్టపోతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని, అక్రమ నిర్మాణ దారులకు అధికారులు అడ్డదారుల్లో అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు .కోర్టులో కేసులు ఉండగా అనుమతులు ఇస్తున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.