మనవార్తలు ,హైదరాబాద్:
చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లో ని రామోజీ గూడ అనే ఏరియాలో అక్షర ఇంజనీరింగ్ కంపెనీ లో షెడ్ వర్క్ పని కోసం కాంట్రాక్టర్ వద్దకు పనిచేయుటకు షాపూర్ నగర్ లోని శివ నజీర్ అనే కార్మికులు వెళ్లారు రెండు నెలలు పని చేసిన తర్వాత కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా గొడవ పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టడం జరిగింది అక్కడ నుండి బయలుదేరి షాపూర్ కి వచ్చిన కార్మికులు ఇద్దరూ తమకు తెలిసిన వారి ద్వారా కార్మిక నాయకుడు రవి సింగ్ గురించి తెలుసుకొని తన వద్దకు వచ్చి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని తనకు చెప్పడం జరిగింది వారు చెప్పిన వెంటనే కార్మిక నాయకుడు రవిసింగ్ తన మిత్ర బృందంతో కలిసి హుటాహుటిన బయలుదేరి చౌటుప్పల్ ఏరియా లోని రామోజీ గూడెం లో అక్షరా ఇంజనీరింగ్ కంపెనీ లో కాంట్రాక్ట్ తీసుకున్నా వ్యక్తిని కలిసి ఈ విషయాన్ని గురించి పలుమార్లు చర్చించి కార్మికులకు రావాల్సిన రెండు నెలల జీతం అక్షరాల 40 వేల రూపాయలను కార్మిక నాయకుడు రవిసింగ్ ఇప్పించారు .