_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి
_ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత
మనవార్తలు ,గుమ్మడిదల
పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో సంజీవ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళవారం ఉదయం జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక నాయకుల సమక్షంలో రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.