మనవార్తలు ,బొల్లారం:
బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాత బస్తి 3వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో వున్నా మహిళలకు అందరికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనుల గురించి అవగహనా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్, స్థానిక కౌన్సెలర్లు టీ. కిరణ్ కుమార్ రెడ్డి,మహిళా మోర్చా ఇంచార్జి జి.పుణ్యవతి, సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి అందరు కలిసి మొక్కలు నాటారు .
అనంతరం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ మాట్లాడుతూ కాలనీ ప్రజలందరికి ప్రధాని నరేంద్ర మోదీ గత 8 సంవత్సరాలనుండి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి డ్వాక్రా గ్రూప్ సభ్యులకు మరియు కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి,సీనియర్ నాయకులు ఉదయ్ కిరణ్, బాల్ సింగ్, సమ్మయ్య, హరినాథ్,ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్,బి. సరిత, రాజేశ్వరి, శ్రీలత, కాంచన, భారీ ఎత్తున మహిళాలు పాల్గొన్నారు.