మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని తేజ కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ గణపతి నవగ్రహ సహిత ఆంజనేయ శివ పంచాయతన ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలోపటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దివంగత గోపి రెడ్డి జైపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గోపిరెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.