మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రధాని మోడీ ఎనిమిది ఏళ్ల కాలం స్వర్ణయుగమని అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం కర్థనుర్ గ్రామంలో మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు. మోడీ 8 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి బీజేపీ పేరుతో కర పత్రాలను పంపిణీ చేశారు. 80 కోట్ల అట్టడుగు వర్గాల ప్రజలకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా ఆహారం అందించిన ఘనత మోడీకే దక్కిందని మండల అధ్యక్షులుఈశ్వరయ్య అన్నారు.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2.3కోట్ల ఇళ్ళు మంజూరయ్యాయని తెలిపారు.ఆయుష్మాన్ భారత్ యోజన కింద 3.2 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించామని శ్రీకాంత్ గౌడ్ అన్నారు . కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందన్నారు .ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళ దిశగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు .విద్యార్థులకు , నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ జూన్ 23 నుంచి జూలై 12 వరకు మూడోవిడత పాదయాత్ర విజయవంతం చేయాలన్నారు .