మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన పటాన్చెరులో నిర్వహించతలపెట్టిన ఎనిమిదవ జాతీయ కరాటే మరియు కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ ఆహ్వాన పత్రిక ను సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఛాంపియన్ షిప్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ అకాడమీల మాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజవర్గం లో క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, టోర్నీ నిర్వహకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.
