మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.వి.శివశంకర్ రావు ఈ నెల మే 1న తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డ్ అందుకున్న సందర్భంగా బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్ని అభినందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివశంకర్ రావు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేయడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మికులకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, పోచారం కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.