_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి
_త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు
మనవార్తలు ,పటాన్ చెరు
12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీరంగూడ కమాన్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో అశ్వారూఢ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో లింగాయత్ సమాజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాయకమే కైలాసం, దేహమే దేవాలయం, భక్తి కన్నా సత్ప్రవర్తన ముఖ్యం అంటూ చేసిన బోధనలు నేటి తరానికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవేశ్వర్, విజయ్ కుమార్, చంద్ర శేకర్ రెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.