మనవార్తలు,శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి చందానగర్ కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి జన్మదిన వేడుకలను బిజెపి కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బిజెపి కార్యకర్తలు శాలువాలతో కసిరెడ్డి సింధు రెడ్డిని సత్కరించారు. అనంతరం సింధు రెడ్డి నీరు పేదలకు తినుబండారాలు,పళ్లు అందచేశారు. ఆ తరువాత కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జన్మదినం రోజున ఆర్భాటలతో కాకుండా పేదలకు తోచిన సహాయం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు .మనం మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికిసహాయం చేశే గుణం అలవర్చుకోవాలని కార్యకర్తలను కోరారు. అనంతరం దీప్తి శ్రీ నగర్ వృద్ద ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలను కసిరెడ్డి సింధు రెడ్డి అభినందించారు .ఈ కార్యక్రమంలో చందానగర్ బిజెపి కార్యకర్తలు మరియు యువ నాయకులు ఆదిత్య కుమార్ ,మురళి ,నరేష్ ,తేజ పాల్గొన్నారు .