మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు మండలం ఘనపూర్ గ్రామ పరిధిలోని శ్రీ సాయి బాబా దేవాలయం 7 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.