మనవార్తలు ,పటాన్ చెరు:
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ తరగతులను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 90 రోజుల పాటు కష్టపడి చదివితే జీవితాంతం సమాజంలో తలెత్తుకుని బ్రతకవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకు లతోపాటు, ఉన్నత అధికారుల చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని, అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శిక్షణ తరగతుల ఇంఛార్జి గోపి శంకర్, ఎస్సై నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
